పవన్ తో గోపీచంద్.. కాంబో ఫిక్సా..?

మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ రీమేక్ లో ఒక హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఇక సినిమాలో సెకండ్ హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ సెకండ్ పాత్రలో రానా, సుదీప్, నితిన్ ఇలా అందరి పేర్లు చెబుతున్నారు. 

లేటెస్ట్ గా ఈ రీమేక్ లో మరో హీరో పేరు వినపడుతుంది. పవర్ స్టార్ తో యాక్షన్ హీరో గోపీచంద్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని అంటున్నారు. మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న గోపిచంద్ కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేక వెనకపడ్డాడు. ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్న గోపీచంద్ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో నటిస్తాడని టాక్. అదే నిజమైతే పవన్, గోపీచంద్ కాంబో కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. గోపీచంద్ ను ఈ సినిమా ఫాం లోకి తెచ్చేలా చేస్తుందని అంటున్నారు.