
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ త్రిష గురించి కొత్తగా ప్రైచయం చేయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం రెండు ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్స్ అందరితో నటించింది. ఈమధ్య కెరియర్ లో కొద్దిగా వెనకపడ్డా 96 సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా సరే తమిళంలో మాత్రం మళ్ళీ తన జోష్ కొనసాగిస్తుంది త్రిష.
అయితే ముదురు భామ పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం సైలెంట్ అవుతుంది. 2015లో బిజినెస్ మెన్ తో ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న త్రిష పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం మనసుకి నచ్చిన వాడు దొరికితే కచ్చితంగా వెళ్లి చేసుకుంటా అంటుంది. తనని అర్ధం చేసుకునే వ్యక్తి కావాలని.. అలాంటి వాడు దొరికితే కొత్త జీవితం స్టార్ట్ చేస్తా అంటుంది. అయితే అలాటి వ్యక్తి దొరక్కపోతే మాత్రం జీవితాంతం ఒంటరిగానే గడుపుతా అంటుంది త్రిష.