
స్టార్ టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా తన ఆటతీరుతో మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. సానియా మీర్జా ఆటే కాదు అందచందాలు కూడా మెచ్చే అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్ క్రికెటర్ షొయబ్ మాలిక్ ను పెళ్లాడిన సానియా తన సేవలు ఎప్పటికీ భారత్ కే అంకితమని చెప్పింది. టెన్నీస్ స్టార్ సానియా యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు. వెబ్ సీరీస్ స్టార్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఎం.టివి నిషేద్ ఎలోన్ టుగెదర్ వెబ్ సీరీస్ లో సానియా నటిస్తున్నారట. ఐదు ఎపిసొడ్స్ గా వచ్చే ఈ వెబ్ సీరీస్ లో సానియా అలరించడానికి రెడీ అయ్యారు. ఈ వెబ్ సీరీస్ టీబీపై చైతన్యం తెచ్చేలా ఉంటుందని తెలుస్తుంది. ట్యుబర్క్యులోసిస్ పై అవగాహన కలిగించేలా ఈ వెబ్ సీరీస్ ఉంటుందట. సనియా మీర్జీ ద్వారా ఈ విషయాన్ని చెప్పిస్తే ఇది ఎక్కువమందికి రీచ్ అవుతుందని ఆమెను ఈ వెబ్ సీరీస్ లో సెలెక్ట్ చేసినట్టు మేకర్స్ చెబుతున్నారు.