
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్న సినిమా రాధే శ్యాం. ఈ సినిమాను రాధే శ్యామ్ డైరెక్ట్ చేస్తుండగా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతుంది. ఈ సినిమాకు యాంటీ క్లైమాక్స్ రాసుకున్నాడట రాధాకృష్ణ. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరో చనిపోతాడని టాక్.
రాధే శ్యామ్ పోస్టర్ లో రోమియో.. జులియేట్, సలీం.. అనార్కలీ, దేవదాసు..పార్వతీ లాంటి అమర ప్రేమికులను చూపించాడు. రాధే శ్యామ్ కూడా అలాంటి ప్రేమ గాథ అని అంటున్నారు. అయితే క్లైమాక్స్ గురించి ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు. బాహుబలి తర్వాత సాహో సినిమా చేసిన ప్రభాస్ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అందుకే రాధే శ్యామ్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.