
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతి శెట్టి. ఉప్పెన ప్రచార చిత్రాలతోనే తెలుగులో మరో రెండు క్రేజీ ఛాన్సులు అందుకుంది కృతి. ఉప్పెన త్వరలో రిలీజ్ అవుతుండగా నాని శ్యాం సింగ్ రాయ్ తో పాటుగా సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ సినిమాలో కృతి శెట్టికి ఛాన్స్ ఇచ్చారు.
యువ హీరోల సరసన వరుస ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇష్టమని చెబుతుంది. చరణ్ సినిమాలన్ని ఆమె ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసిందట. చరణ్ అంటే చాలా ఇష్టమని చెబుతుంది కృతి శెట్టి. ఎలాగు మెగా హీరోతో ఛాన్స్ వచ్చింది కాబట్టి చరణ్ తో కూడా జోడీ కట్టి స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది అమ్మడు. ఉప్పెన రిలీజ్ తర్వాత అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తాయని అంటున్నారు.