రూల్స్ బ్రేక్ చేసిన సమంత..!

అక్కినేని కోడలు సమంత కేవలం సినిమాలతోనే కాదు వెబ్ సీరీస్ లతో పాటుగా టాక్ షోలకు హోస్ట్ గా కూడా అదరగొడుతుంది. ఆహా కోసం రీసెంట్ గా సామ్ జామ్ అంటూ సందడి మొదలుపెట్టింది సమంత. ఇక అమేజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీక్వల్ లో నటించింది సమంత. ఈ వెబ్ సీరీస్ లో టెర్రరిస్ట్ గా సమంత కనిపించనుందని తెలుస్తుంది.

స్టార్ హీరోయిన్ గా సమంత రూల్స్ బ్రేక్ చేసి మరి ఈ పాత్ర చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఫ్యామిలీ మ్యాన్ 2లో తనని చూసి అందరు షాక్ అవుతారని అంటుంది సమంత. ఎప్పుడూ ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడే సామ్ వెబ్ సీరీస్ లో ఇక మీదట ఈరకమైన ప్రయత్నాలే చేస్తానని అంటుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం రూల్స్ అన్ని బ్రేక్ చేశానని.. తన పాత్ర తప్పకుండా అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పుకొచ్చారు సమంత.