
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చి చేసిన మొదటి సినిమా దొరసాని ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవడంలో వెనకపడ్డది. అందుకే రెండో ప్రయత్నంగా ఆనంద్ దేవరకొండ క్రేజీ మూవీ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ ఆనంద్ దేవరకొండ సినిమా వస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
అమేజాన్ ప్రైం లో నవంబర్ 20న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా భారీ రేటుకి అమ్ముడయినట్టు తెలుస్తుంది. అమేజాన్ ప్రైం ఈ సినిమాను 4.5 కోట్లకు కొన్నారని టాక్. ఆనంద్ దేవరకొండ రేంజ్ కు ఇది మంచి డీల్ అని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ సరసన వర్ష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే పక్కా హిట్ కొట్టేలా ఉంది.