
ధనుష్, సాయి పల్లవి జంటగా 2018లో వచ్చిన సినిమా మారి 2. ఈ సినిమాను బాలాజి మోహన్ డైరెక్ట్ చేశారు. సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. సినిమాలో రౌడీ బేబీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. మిలియన్ మార్క్ కాదు ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించింది. అంటే ఏకంగా 100 కోట్ల వ్యూస్ అన్నమాట. ఇది మాములు విషయం కాదు. 100 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ సాంగ్ గా రౌడీ బేబీ సూపర్ రికార్డ్ సాధించింది.
ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ఈ రేంజ్ వ్యూస్ సాధించడం పట్ల చిత్రయూనిట్ తమ సంతోషాన్ని తెలియచేస్తున్నారు. 9 ఏళ్ల క్రితం వై దిస్ కొలెవెరి డీ అంటూ షేక్ చేసిన ధనుష్ ఆ సాంగ్ 9వ యానివర్సరీ టైం లో ఈ రికార్డ్ సాధించడం తో సూపర్ ఎక్సయిట్ అవుతున్నారు.