
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఇప్పుడిప్పుడే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు ఈ ఇయర్ నానితో మల్టీస్టారర్ మూవీ Vలో నటించాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సుధీర్ బాబు పలాస డైరక్టర్ కరుణ కుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు శ్రీదేవి సోడా సెంటర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో పాటుగా సుధీర్ బాబు మరో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. టాలెంటెడ్ డైరక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటితో సుధీర్ బాబు మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఇద్దరు కలిసి సమ్మోహనం, V సినిమాలు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉప్పెన ఫేం కృతి శెట్టిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.