
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ 20 ఏళ్ల నట ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కామన్ డిపిని సిద్ధం చేశారు. అంతకుముందు బాల రామాయణంలో నటించిన తారక్ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో హీరోగా చేశాడు. ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తారక్ బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో రామోజీ రావు ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, రాజమౌళి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1 సినిమా వచ్చింది.
ఈ సినిమాతో తారక్ మొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆది, సింహాద్రి ఇలా కెరియర్ మొదట్లోనే సెన్సేషనల్ హిట్లు కొడుతూ వచ్చాడు. ఎన్.టి.ఆర్ 20 ఏళ్ల సినీ ప్రస్థానం గుర్తుచేసుకుంటూ నందమూరి ఫ్యాన్స్ సిడిపి రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ సిడిపి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.