.jpg)
నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో తన సత్తా చాటిన వివేక్ ఆత్రేయ తన నెక్స్ట్ సినిమాను నానితో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటుగా సినిమాలో హీరోయిన్ గా నజ్రియా నటిస్తుందని ఎనౌన్స్ చేశారు.
ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా ఫైనల్ చేశారట. ఎనౌన్స్ చేయలేదు కాని ఈ సినిమాకు అంటే సుందరానికి టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. నాని, నజ్రియా జంటగా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్, రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ పూర్తి కాగానే వివేజ్ ఆత్రేయ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.