పూరీ మళ్లీ తనయుడితోనే..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో పూర్తి ఫాంలోకి వచ్చాడని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పాన్ ఇండియా మూవీనే ఫిక్స్ చేసుకున్నాడు పూరీ. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ డైరక్షన్ లో వస్తున్న ఫైటర్ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పూరీ ఎవరితో సినిమా చేస్తాడన్నది తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం పూరీ మరోసారి తనయుడు ఆకాశ్ ను హీరోగా పెట్టి సినిమా చేస్తాడని అంటున్నారు. ఆల్రెడీ ఆకాష్ తో పూరీ మెహబొబా సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఆకాశ్ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఆ సినిమా ఎలాగైనా హిట్ కొడుతుందని అంటున్నారు. అందుకే ఆ వెంటనే పూరీ డైరక్షన్ లో సినిమా పడితే హీరోగా ఒక క్రేజ్ వస్తుందని ప్లాన్ చేశాడు. పూరీ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.