RRR నుండి దీపావళి గిఫ్ట్..!

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న సినిమా RRR. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో.. ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరి పాత్రలను పరిచయం చేస్తూ వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక పండుగ ఏదైనా సరే స్టార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్ రావాల్సిందే. దసరాకి ఎలాంటి అప్డేట్ ఇవ్వని రాజమౌళి దీపావళికి ఇద్దరు హీరోలతో స్పెషల్ పిక్స్ దిగి షేర్ చేశారు. 

RRR అంటూ వెనక బ్యాక్ గ్రౌండ్ లో లైటింగ్ పెట్టి దీపావళికి విషెస్ అందించారు. ఈమధ్యనే మరో షెడ్యూల్ మొదలు పెట్టిన ఈ సినిమా 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో అజయ్ దేవగ, అలియా భట్, ఒలివియా మోరిస్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.