కాలం, కరోనా రెండు నన్ను ఆడుకున్నాయి..!

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అన్న వార్త మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ రవడంతో చిరు కూడా షాక్ అయ్యారు. అయితే లేటెస్ట్ గా నిర్వహించిన టెస్ట్ లో చిరంజీవికి కరోనా నెగటివ్ అని తేలిందట. రిపోర్ట్ పాజిటివ్ రావడంతో హోం క్వారెంటైన్ లో ఉంటూ మెడిసిన్ స్టార్ట్ చేసిన చిరు నాలుగు రోజులు అవుతున్నా ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారట.

అయితే ఈసారి టెస్ట్ లో కరోనా నెగటివ్ వచ్చిందట. ఒకసారి కాదు రెండు వేరు వేరు చోట్ల టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రిపోర్ట్ తాగా తాను మొదట చేయించుకున్న దగ్గర మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా అక్కడ కూడా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందట. సో చిరుకి మొదట చేసిన ఆర్టి పిసీఅర్ కిట్ ప్రభావం వల్లే రిపోర్ట్ వేరేగా వచ్చిందనే నిర్ణయానికి వచ్చారు. చిరంజీవికి కరోనా నెగటివ్ అని తెలియగానే ఫ్యాన్స్ అంతా హమ్మయ్య అనుకున్నారు.