12 కథలను రిజెక్ట్ చేసిన రామ్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాతో నభా నటేష్, నిధి అగర్వాల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ రెడ్ సినిమా చేస్తున్నాడు. తమిళ సినిమా తడమ్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో రాం డ్యుయల్ రోల్ చేశాడు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రాలేదు. ఈ లాక్ డౌన్ లో రామ్ దాదాపు 12 కథల దాకా విన్నాడని తెలుస్తుంది. అందులో ఓ రెండిటిని ఫైనల్ చేసినట్టు టాక్. త్వరలోనే వాటిని ఎనౌన్స్ చేస్తాడని టాక్. ఇస్మార్ట్ శంకర్ తో ఫాంలోకి వచ్చిన రామ్ రెడ్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.