
బిగ్ బాస్ సీజన్ 4కు కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. సీజన్ 3 కూడా నాగ్ హోస్ట్ చేయగా సీజన్ 4లో ఆయన హోస్ట్ గా కొనసాగుతున్నారు. అయితే నాగ్ హోస్ట్ గా చేస్తున్నప్పుడు లాస్ట్ సీజన్ లో కూడా ఒక వారం గెస్ట్ హోస్ట్ గా శివగామి రమ్యకృష్ణ వచ్చి అలరించారు. సీజన్ 3లో రమ్యకృష్ణ రాగా సీజన్ 4లో కోడలు సమంత వచ్చి దసరా స్పెషల్ ఎపిసోడ్ ను మరింత స్పెషల్ చేసింది. నాగ్ హోస్ట్ గా చేస్తే అక్కినేని ఫ్యామిలీ మొత్తం చేస్తున్నట్టే. అదెలా అంటారా దసరా ఎపిసోడ్ లో సమంతతో పాటుగా అఖిల్ కూడా మెరిశాడు.
ఈ వారం మరో అక్కినేని హీరో నాగ చైతన్య బిగ్ బాస్ షోలో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ షో కాస్త అక్కినేని ఫ్యామిలీ షో అవుతుందని ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా ఉన్నారు. ఏం చేసినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కావాలి అందుకే బిగ్ బాస్ టీం ఇలా ప్లాన్ చేసింది.