మారేడుమిల్లిలో అల్లు అర్జున్ పుష్ప షూటింగ్..!

ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుపనున్నారు. ఇప్పటికే అక్కడ ఉడ్ హౌజ్ లను రెంట్ కు తీసుకున్నారని తెలుస్తుంది.

అక్కడే ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్పతో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.