ఆకాశం నీ హద్దురా షార్ట్ రివ్యూ

కోలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. ఆయనకు తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని సూర్య లేటెస్ట్ గా సురరై పోట్రు తెలుగులో ఆకాశం నీ హద్దురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య నిర్మించారు. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి టాక్ తెచ్చుకుంది. 

చంద్ర మహేష్ అలియాస్ మహా పాత్రలో సూర్య నటించారు. ఓ స్కూల్ మాష్టారు కొడుకైన మహా ఎయిర్ ఫోర్స్ లో చేరుతాడు. విమానం ఎక్కడ ధనవంతులకే సాధ్యమా అది సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీవాలని ప్రయత్నించే వ్యక్తి కథ ఈ సినిమా. అయితే తను నెరవేర్చాలనుకున్న ఈ కలని అడ్డుపడే వ్యక్తులెవరు.. వారిని దాటుకుని మహా దీన్ని ఎలా సాధించాడు అన్నది ఆకాశం నీ హద్దురా కథ. 

ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్ గోపీనాథ్ జీవిత కథ స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కించారని చెప్పొచ్చు. సూర్య నటన ఈ సినిమాకు హైలెట్. పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి సూర్య ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన అపర్ణ మురళి కూడా బాగా చేసింది.       

సుధ కొంగర డైరక్షన్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిఖిత్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జివి ప్రకాశ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. సినిమాను సాధ్యమైనంత వరకు రియలిస్టిక్ గా తీయడానికి ప్రయత్నించిన సుధ కొంగర ఆ విషయంలో పర్ఫెక్ట్ అనిపించారు. కథ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అక్కడక్కడ కొద్దిగా స్లో అయినట్టు అనిపించినా అది సినిమా మీద ఎఫెక్ట్ పడలేదు. ఇక అమేజాన్ ప్రైం లో రిలీజైన సినిమాలన్ని నిరాశపరచగా ఆకాశం నీ హద్ధురా సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.