పుష్ప కోసం విలన్ గా ఆ హీరో..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. విజయ్ సేతుపతి నటిస్తాడని అనుకుంటే అతను రెమ్యునరేషన్ ఎక్కువ అడిగాడని వద్దనుకున్నారు.

బాలీవుడ్ హీరోని విలన్ గా మెప్పించాలని అనుకున్నా అది వర్క్ అవుట్ కాలేదని తెలుస్తుంది. ఫైనల్ గా కోలీవుడ్ హీరో ఆర్య పుష్ప విలన్ గా సెలెక్ట్ చేశారని టాక్. ఆల్రెడీ అల్లు అర్జున్ వరుడు సినిమాలో ఆర్య విలన్ గా నటించాడు. ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. పుష్పకు విలన్ గా ఆర్య పర్ఫెక్ట్ అని సుకుమార్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.