
బాలికావధు తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యి ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ గా నటించింది అవికా గోర్. ఆ తర్వాత సినిమాలైతే చేసింది కాని స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డది. లాస్ట్ ఇయర్ రాజు గారి గది 3 సినిమా చేసిన అవికా గోర్ ఈమధ్యనే తన స్లిం లుక్ తో అందరికి షాక్ ఇచ్చింది. ఇక లేటెస్ట్ గా అమ్మడు తన లవర్ ను పరిచయం చేసింది. కెరియర్ దాదాపు ముగింపు దశకు వచ్చినట్టు ఫిక్సైన అవికా గోర్ తన లవర్ మిలింద్ చద్వానీని పరిచయం చేసింది.
అతనితో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన అవికా నన్ను అర్ధం చేసుకునే వ్యక్తి.. నా లైఫ్ కు ఎట్టకేలకు లవ్ దొరికింది అంటూ అమ్మడు కామెంట్స్ పెట్టింది. హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు దక్కించుకోలేని అవికా గోర్ ప్రియుడిని రివీల్ చేసింది. బుల్లితెర మీద ఎలాగు అమ్మడికి ఆఫర్లు వస్తాయి కాబట్టి ఆమె నటించే ఛాన్స్ ఉంది.