అక్కడ ఛత్రపతి రీమేక్ చేస్తున్న బెల్లంకొండ బాబు..!

ప్రభాస్ ను మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేసిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు రాజమౌళి చూపించిన ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రభాస్ కెరియర్ అప్పటివరకు ఉన్న సినిమాలన్ని పక్కన పెట్టి ముందు వరుసలో నిలబడ్డది ఛత్రపతి. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తుంది. మన సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవడం కామనే కాని ఛత్రపతి సినిమా బాలీవుడ్ లో ఓ తెలుగు హీరో రీమేక్ చేయడం విశేషం.

బెల్లకొండ శ్రీనివాస్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారట. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. అక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ కు మాస్ ఇమేజ్ ఉంది. అందుకే అతనికి ఈ రీమేక్ ఆఫర్ వచ్చిందట. ఇక్కడ ప్రభాస్ చేసిన ఆ సినిమా అక్కడ బెల్లంకొండ హీరో చేస్తుండటం విశేషం. మరి హిందీ మార్కెట్ పై కన్నేయాలని చూస్తున్న బెల్లంకొండ బాబు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.