సామ్ జామ్ ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిసింది..!

అక్కినేని కోడలు సమంత కొత్తగా ఆహా కోసం ఓ షో కమిటైన విషయం తెలిసిందే. ఆహా కోసం చేస్తున్న ఈ స్పెషల్ టాక్ షో కోసం సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. బాలీవుడ్ టాక్ షోలకు ధీటుగా ఈ షో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. నవంబర్ 13 నుండి మొదలవుతున్న సామ్ జామ్ టాక్ షోలో మొదటి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వస్తున్నట్టు తెలుస్తుంది. ఆహాకి మొదట బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించాడు. ఇప్పటికి ఆహాకి తన సపోర్ట్ ఇస్తున్నాడు. 

సామ్ జామ్ షో కోసం విజయ్ దేవరరకొండ ఫస్ట్ గెస్ట్ గా వస్తున్నాడు. విజయ్ మాత్రమే కాదు ఈ టాక్ షోలో చిరంజీవి, అల్లు అర్జున్, రాం చరణ్, మహేష్ లాంటి స్టార్స్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఈ టాక్ షో కొత్తగా క్రేజీగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. మరి సినిమాలు, వెబ్ సీరీస్ లతోనే కాదు టాక్ షోతో కూడా సమంత తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది.