రానా దగ్గుబాటి 'ధీరుడు'

దగ్గుబాటి వారసుడు రానా అందరి హీరోలకు భిన్నంగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడు. హీరోగా మంచి ఫాం లో ఉన్నప్పుడు కూడా రాజమౌళి అడిగాడని విలన్ గా బాహుబలి సినిమాలో తను కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేశాడు. భళ్లాలదేవ పాత్రలో రానాని తప్ప మరెవరిని ఊహించలేం అన్నట్టుగా ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం విరాట పర్వం సినిమా చేస్తున్న రానా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. వేణు ఊడిగుల డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా తర్వాత గ్రుహం ఫేమ్ మిలింద్ రావ్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రానా. ఈ సినిమాను ఆచంట గోపీనాథ్ నిర్మిస్తున్నారు. సినిమాకు టైటిల్ గా ధీరుడు అని ఫిక్స్ చేశారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. చూస్తుంటే రానా తన మార్కెట్ పెంచుకునే పనిలో బైలింగ్వల్ మూవీస్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.