బాలకృష్ణ కోసం సయేషా..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాలో హీరోయిన్స్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సినిమాలో హీరోయిన్ గా అంజలి, ప్రత్యా మార్టిన్, పూర్ణ పేర్లు వినపడగా వీళ్లెవరు కాదు కొత్తగా తమిళ హీరోయిన్ సయేషా సైగల్ ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. తెలుగులో అఖిల్ మొదటి సినిమా హీరోయిన్ గా అఖిల్ లో హీరోయిన్ గా నటించింది సయేషా.

అంతేకాదు తమిళ స్టార్ హీరో ఆర్యని ప్రేమించి పెళ్లాడింది కూడా. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పిన సయేషా చెప్పినట్టుగానే బాలయ్య సినిమా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మరి సయేషా అయినా ఫైనల్ హీరోయిన్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.