మాస్ రాజాతో అనసూయ స్టెప్పులు..!

జబర్దస్త్ యాంకర్ ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై తన యాంకరింగ్ తో అలరిస్తూనే సిల్వర్ స్క్రీన్ పై తన స్టామినా చూపిస్తుంది. అమ్మడు ఏ పాత్ర చేసినా సరే అది అదిరిపోతుంది. క్షణం నుండి ఎఫ్-2 లో సర్ ప్రైజ్ రోల్ చేసిన అనసూయ స్పెషల్ సాంగ్ కు రెడీ అంటుంది. సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో సూయ సూయ సాంగ్ తో అలరించిన అమ్మడు లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ కిలాడి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని అంటున్నారు.

రవితేజ, రమేష్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా చేస్తున్నారు. సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయని సెలెక్ట్ చేశారట. ఆల్రెడీ వీర సినిమా చేసిన రవితేజ, రమేష్ వర్మ ఈసారి హిట్ టార్గెట్ తో ఈ సినిమా చేస్తున్నారు.