ఆనంద్ దేవరకొండ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ట్రైలర్ ఇంప్రెస్ చేసింది..!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజు డైరక్షన్ లో వస్తున్న సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమాలో 96 ఫేమ్ వర్ష హీరోయిన్ గా నటిస్తుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ లో నవంబర్ 20న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యింది. తమ్ముడు సినిమా ట్రైలర్ ని అన్న విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.  

మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ విషయానికి వస్తే.. తండ్రి నడిపే హోటల్ లో బాంబే చట్నీ స్పెషలిస్ట్ గా ఉన్న రాఘవ గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలని అనుకుంటాడు. అతని జీవితంలో జరిగిన అద్భుతాలే ఈ సినిమా. సినిమా ఓటిటి రిలీజ్ కాబట్టి డైలాగ్స్ కొద్దిగా బోల్డ్ గానే ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ ఇంప్రెస్ చేయగా ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యేలా ఉన్నాడు. దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాడు.