
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయనే స్వయంగా ప్రకటించారు. కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్న చిరు షూటింగ్ కు వెళ్లే టైం లో కరోనా టెస్ట్ చేయించుకోగా అందులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు చిరంజీవి ట్విట్టర్ లో చెప్పారు. కోవిడ్ లక్షణాలు ఏమి లేవని అన్నారు చిరు. అయితే 4, 5 రోజులుగా తనని కలిసి వారందరు కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. తాను హోం క్వారెంటైన్ లో ఉంటున్నట్టు ట్వీట్ చేశారు.
చిరుకి కరోనా అని తెలియగానే సినీ సెలబ్రిటీస్ అంతా మీరు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి, నాగార్జున సిఎం కె.సి.ఆర్ ను కలవడం జరిగింది. హైదరాబాద్ లో సినీ స్టూడియో గురించి చిరంజీవి, నాగార్జునలతో చర్చలు జరిపారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp