రూటు మార్చిన నిత్యా మీనన్

మళయాళ భామ నిత్యా మీనన్ కు ఈమధ్య సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. తనకు నచ్చిన పాత్రలు వస్తేనే తప్ప ఏది వస్తే అది చేయనని మొహమాటం లేకుండా చెప్పే నిత్యా మీనన్ ఇప్పుడు అసలు ఛాన్సులు రాకుండా చేసుకుంది. అభినయ తారగా ప్రేక్షకుల మనసులు గెలిచిన నిత్యా మీనన్ సినిమాలు తగ్గేసరికి ఓటిటిల వైపు టర్న్ తీసుకుంది. 

ఇప్పటికే బ్రీత్ ఇన్ టూ ద షాడోస్ అనే వెబ్ సీరీస్ లో నటించిన నిత్యా మీనన్ లేటెస్ట్ గా ఓ తెలుగు వెబ్ సీరీస్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది. స్వప్నా దత్ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ గోంటేష్ ఉపాధ్యే డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. నిత్యా మీనన్ తో పాటు యాక్టర్, డైరక్టర్ అవసరాల శ్రీనివాస్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ లో ఈ వెబ్ సీరీస్ సెట్స్ మీదకు వెళ్తుందట. 8 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేస్తున్న ఈ వెబ్ సీరీస్ ను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.