
మెగా పవర్ స్టార్ రాం చరణ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ప్రభాస్ విసిరిన ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన చరణ్ సండే తన హౌజ్ లో మొక్కలు నాటారు. చరణ్ తో పాటు టి.ఆర్.ఎస్ ఎంపి సంతోష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటడం మనందరి ప్రాధనిక కర్తవ్యం.. ప్రకృతి సమతుల్యంతో ఉంటేనే మనమంతా భూమి మీద ఉంటాం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు రాం చరణ్.
రాం చరణ్ పూర్తి చేసిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హీరోయిన్ అలియా భట్, డైరక్టర్ రాజమౌళి, ఆర్.ఆర్.ఆర్ యూనిట్ సభ్యులను నామినేట్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికి వస్తే రాం చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనున్నారు. చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది.