
రాజమౌళి సినిమా అప్డేట్ అంటే దానికి ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో అద్భుతాన్ని క్రియేట్ చేస్తున్న రాజమౌళి సినిమాపై ఆడియెన్స్ అంచనాలు పెంచుకునేందుకు ఓ చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ఫైట్ సీన్ అదే యాక్షన్ సీన్ ను రివీల్ చేశారు. చిత్రయూనిట్ సభ్యులు తీసినట్టు తెలుస్తున్న ఈ వీడియో క్లిప్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
నీరు.. నిప్పు కలయికగా రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ మూవీపై ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందని చెప్పొచ్చు. సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఓలివియా మోరిస్ కూడా నటిస్తున్నారు.
Anddd... Leaving it to your imagination now 😉🔥🌊 #RRRDiaries #RRRMovie #RRR pic.twitter.com/gm1KHmKSpM