
కేవలం పాతిక వేల రూపాయల అప్పు తీర్చడానికి హీరోగా మారానని చెప్పి షాక్ ఇచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తమిళ నటుడు నిర్మాత శివ కుమార్ తనయుడు సూర్య హీరోగా మారిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి 25 వేల రూపాయలు అప్పు తీర్చడానికి మాత్రమే తను హీరోగా మారానని.. తనకు మొదటి సినిమాకు 50 వేలు పారితోషికం ఇచ్చారని చెప్పారు సూర్య. అందులో నాన్నకు 25 వేలు అప్పు తీర్చడానికి ఇచ్చానని అన్నారు.
హీరోగా మారక ముందు సూర్య గార్మెంటరీ ఫ్యాక్టరీలో వర్క్ చేశారట. తను ఓ నిర్మాత కొడుకు అని తెలియకుండానే 8 నెలల పాటు అక్కడ వర్క్ చేశారట సూర్య. 1995లో తనకు మొదటి అవకాశం వచ్చినా ఆసక్తి చూపలేదని.. అయితే నాన్న అప్పు తీర్చడం కోసం హీరోగా మారానని అన్నారు సూర్య. 1997లో మణిరత్నం ప్రొడ్యూస్ చేసిన నెర్రుక్కు నెర్ సినిమాతో తెరంగేట్రం చేశాడు సూర్య. ఆ తర్వాత 2001లో వచ్చిన నందా సినిమాతో హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు సూర్య. ప్రస్తుతం సుధ కొంగర డైరక్షన్ లో ఆకాశం నీ హద్ధురా సినిమా చేశారు సూర్య. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.