
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ గా సినిమా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మళయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ తెలుగు రీమేక్ కోసం డైరక్టర్ గా ముందు సాహో ఫేమ్ సుజిత్ ను అనుకోగా కొన్ని కారణాల వల్ల అతను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. సుజిత్ ప్లేస్ లో వినాయక్ ఆ ఛాన్స్ అందుకోగా లేటెస్ట్ టాక్ ప్రకారం వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు.
లూసిఫర్ రీమేక్ గా తెలుగు వర్షన్ వినాయక్ సిద్ధం చేయగా అది నచ్చని చిరు మరో ఛాన్స్ ఇచ్చాడట. వినాయక్ సిద్ధం చేసిన ఫైనల్ వర్షన్ తో కూడా చిరంజీవి సాటిస్ఫై అవలేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి వినాయక్ కూడా ఎగ్జిట్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి చిరు సినిమా నుండి వినాయక్ తప్పుకున్నాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.