రాధే శ్యామ్ ఒక్క ఫైట్ కు అంత ఖర్చు పెడుతున్నారా..?

ప్రభాస్, పూజా హెగ్దే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. రీసెంట్ గానే ఈ సినిమా ఇటలీలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అయితే రాధే శ్యామ్ కోసం ఓ భారీ ఫైట్ చేయనున్నారట. భారీ యాక్షన్ సీన్ గా ప్లాన్ చేస్తున్న ఈ ఎపిసోడ్ కు 2 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ ఎట్రాక్షన్ గా కానుంది. బాహుబలి తర్వాత సాహో అంచనాలను అందుకోలేదు. రాధే శ్యామ్ తో ఈసారి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. పిరియాడికల్ లవ్ స్టోరీగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వస్తున్న రాధే శ్యామ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.