ఆహా కోసం అల్లు అర్జున్ కూడానా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోగా బాక్సాఫీస్ పై తన దూకుడు చూపిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ నెక్స్ట్ సుకుమార్ తో పుష్ప అంటూ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడు. ఇక సినిమాలతోనే కాదు ఆహా ఓటిటి కోసం కూడా అల్లు అర్జున్ యాడ్ చేస్తున్నాడట. అల్లు అరవింద్, మై హోం రామేశ్వర రావు కలిసి పెట్టిన ఆహా కంప్లీట్ తెలుగు ఓటిటిగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ తో సందడి చేస్తున్న ఆహా ఇప్పుడు సరికొత్త టాక్ షోస్ చేస్తుంది.

ఆహా కోసం ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ ప్రమోషనల్ యాడ్ ను త్రివిక్రం డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఆహా కోసం అల్లు అర్జున్ ప్రమోషన్ మరింత క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు లేటెస్ట్ గా సమంత చేస్తున్న సాం జాం టాక్ షోలో కూడా అల్లు అర్జున్ పాల్గొంటాడని తెలుస్తుంది.