
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వస్తున్న సినిమా నాంది. ఎప్పుడూ కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించే అల్లరోడు సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్న సినిమా నాంది. సినిమాలో న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. పూర్తిగా సీరియస్ గా సాగే ఈ సినిమా నుండి అప్పట్లో వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా సినిమా నుండి బ్రీత్ ఆఫ్ నాంది అంటూ మరో కొత్త టీజర్ వదిలారు.
ఈ టీజర్ లో కూడా సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటన్నది తెలియచేశారు. అల్లరి నరేష్ పూర్తిగా డిఫరెంట్ గా ట్రై చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ మహర్షిలో మహేష్ స్నేహితుడిగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన అల్లరి నరేష్ నాందితో తన కెరియర్ కు సరికొత్త నాంది పలుకనున్నాడని చెప్పొచ్చు.