
కరోనా లాక్ డౌన్ ముగిసిన తర్వాత సౌత్ ఇండియా నుండి ఫారిన్ షూట్ చేసుకున్న హీరో ప్రభాస్ ఒక్కడే. ఇక ఇంటలీలో షూటింగ్ జరిపింది అయితే ప్రభాస్ రాధే శ్యాం టీమే మొదటిది. ఈ సినిమా నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుపుకుంది. హీరోయిన్ పూజా హెగ్దే కూడా ఈ సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లింది. అయితే పూజా హెగ్దే తన పోర్షన్ షూటింగ్ పూర్తి కాగానే ఇండియా వచ్చేసింది. అయితే ప్రభాస్ ఇంకా చిత్రయూనిట్ మాత్రం ఇటలీలోనే ఉన్నారు.
షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ ఇటలీ మొత్తం చుట్టేసినట్టు తెలుస్తుంది. అక్కడ లగ్జరీ కార్లలో తిరుగుతూ అక్కడక్కడ ఫ్యాన్స్ ను కలిసి ముచ్చటిస్తూ కనిపించారు. అక్కడ మీడియా కూడా ప్రభాస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇటలీ చుట్టేసిన ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ప్రభాస్ ఇండియాకు వచ్చేస్తాడని తెలుస్తుంది. హైదరాబాద్ లో మరో షెడ్యూల్ తో రాధే శ్యాం షూటింగ్ పూర్తవుతుందట. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నా డిసెంబర్ చివరి కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసి 2021 మొదట్లోనే రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.