అల్లరి నరేష్ ఇక అన్నిటికీ ఓకే..!

ఈవివి తనయుడు అల్లరి నరేష్ రాజేంద్ర ప్రసాద్ లా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అయితే కొంతకాలంగా కెరియర్ లో బాగా వెనకపడ్డ అల్లరోడు మళ్ళీ తన హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన అల్లరి నరేష్ ప్రస్తుతం బంగారు బుల్లోడు, నాంది సినిమాలు చేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న నాంది సినిమాలో అల్లరి నరేష్ న్యూడ్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.    

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ ఇక మీదట తను వేరే హీరోల సినిమాల్లో కూడా నటిస్తానని అంటున్నాడు. మల్టీస్టారర్ గానే కాదు స్టార్ సినిమాల్లో చిన్న పాత్ర అయినా సినిమాకు ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం తప్పకుండా అలాంటి సినిమాలైనా చేస్తా అంటున్నాడు అల్లరి నరేష్. ఇక మీదట అన్నిటికి ఓకే అంటూ చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. అంతేకాదు తండ్రి బ్యానర్ లో వరుస సినిమాలు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట.