బన్నీ బ్యాచ్ లర్ పార్టీ.. ఎట్టెట్టా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన యంగ్ టీం తో పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే దానికి బ్యాచ్ లర్ పార్టీ అని పేరు పెట్టారు. అదేంటి బన్నీ ఇప్పుడు బ్యాచ్ లర్ పార్టీ ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. తన టీం లో ఒకరికి పెళ్లి ఫిక్స్ అవగా అతని తరపున టీం అందరికి బ్యాచ్ లర్ పార్టీ ఇచ్చాడు. హైదరాబాద్ నైట్ క్లబ్ లో ఈ పార్టీ జరిగింది. బన్నీ యంగ్ టీం అంతా ఈ పార్టీలో పాల్గొన్నారు.

తన దగ్గర పనిచేసే ఉద్యోగులను బన్నీ చాలా బాగా చూసుకుంటాడు. కరోనా లాక్ డౌన్ టైం లో మూడు నెలలు శాలరీ కూడా ఒకేసారి ఇచ్చి వారి బాగోగులు చూసుకున్నారు. తన స్టాఫ్ లో ఎవరిదైనా బర్త్ డే అయితే తనే దగ్గర ఉండి పార్టీ చేయిస్తాడు. తన స్టాఫ్ తో బన్నీ ఈ క్లోజ్ నెస్ చూసి అందరు త్రిల్ అవుతున్నారు.