చరణ్ తో సమంత..!

అక్కినేని కోడలిగా ప్రమోట్ అయ్యాక కూడా సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు సమంత. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు ఆమె ఓకే చెబుతుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేవని అనుకుంటున్న టైం లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో సినిమా చేస్తుందట సమంత. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాం చరణ్ కు జోడీగా సమంతని సెలెక్ట్ చేసినట్టు టాక్.

ఇప్పటికే చిరు సరసన కాజల్ నటిస్తుంది. పెళ్లి చేసుకున్నా సరే ఆచార్య షూటింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని కాజల్ ఆచార్య యూనిట్ కు బరోసా ఇచ్చిందట.  అందుకే నవంబర్ 9 నుండి ఆచార్య తిరిగి సెట్స్ మీదకు వెళ్తుంటే వారం రోజుల్లో కాజల్ కూడా షూటింగ్ కు వస్తుందని టాక్. ఇక సినిమాలో చరణ్ కు జతగా సమంత నటిస్తుందట. ముందు ఈ పాత్రకు రష్మిక మందన్నని అనుకున్నారు కాని ఆమె డేట్స్ అడ్జెస్ట్ అవ్వక సాం ను ఫిక్స్ చేశారట. ఆల్రెడీ రాం చరణ్ తో సమంత రంగస్థలం సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి రిపీట్ అవుతున్న ఈ కాంబో ఈసారి కూడా మరో సూపర్ హిట్ ఇస్తుందేమో చూడాలి.