
నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా భీష్మ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ కాగా బుల్లితెర మీద సినిమా ఆడియెన్స్ ను అలరించలేకపోయింది. దసరా స్పెషల్ ప్రీమియర్ షో గా బుల్లితెర మీద టెలికాస్ట్ అయిన భీష్మ సినిమా 6.65 టివి రేటింగ్స్ తెచ్చుకుంది.
సినిమా స్మాల్ స్క్రీన్ పై రావడానికి ముందే ఓటిటిలో రిలీజ్ అవడం అక్కడ చాలామంది ఈ సినిమా చూడడం వల్ల భీష్మని బుల్లితెర మీద పట్టించుకోలేదు. అదీగాక దసరా స్పెషల్ ఎపిసోడ్ గా స్టార్ మాలో బిగ్ బాస్ హోస్ట్ గా సమంత రావడంతో ఆడియెన్స్ అంతా దానికి ట్యూన్ చేశారు. సమంత బిగ్ బాస్ ఎపిసోడ్ కు 11.3 రేటింగ్ దాకా వచ్చిందని తెలుస్తుంది. సో మొత్తానికి స్మాల్ స్క్రీన్ పై భీష్మకు పెద్ద షాక్ ఇచ్చారు ఆడియెన్స్.