
కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమా తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో శ్రీయ శరణ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. కరోనా లాక్ డౌన్ టైం లో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా లేటెస్ట్ గా తిరిగి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ ను డిసెంబర్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
వెంకటేష్ బర్త్ డే సందర్భంగా నారప్ప టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ లుక్ అదిరిపోతుందని తెలుస్తుంది. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచిన శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్ తో తను కూడా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఎఫ్-2, వెంకీమామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ నారప్పతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.