
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమ రాధే శ్యామ్. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గానే ఇటలీలో మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ మరో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తుందట. చివరి షెడ్యూల్ తో ఈ సినిమా దాదాపు పూర్తవుతుందని టాక్.
2021 సమ్మర్ రిలీజ్ అనుకున్న రాధే శ్యామ్ డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసి 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తెలుగులో సంక్రాంతికి రిలీజ్ సినిమాలు చాలా ఉన్నాయి. అఖిల్ బ్యాచ్ లర్, రాం రెడ్, రవితేజ క్రాక్ మూడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఎనౌన్స్ చేశారు. ఒకవేళ రాధే శ్యామ్ వస్తే మాత్రం ఈ సినిమాల రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.