ఆహా కోసం సమంత స్పెషల్ షో..!

తెలుగు ఓటిటి ఆహాని సూపర్ గా ప్రమోట్ చేస్తున్నారు బడా నిర్మాత అల్లు అరవింద్. ఇప్పటికే వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ తో పాటుగా చిన్న సినిమాలను కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇవేకాదు ఆహా కోసం స్పెషల్ గా కొన్ని ప్రోగ్రాంస్ కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ క్రేజీ టాక్ షో ప్లాన్ చేయగా లేటెస్ట్ గా సమంతతో కూడా ఓ కొత్త షో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అ నుండి ఆహా వరకు అంటూ లేటెస్ట్ గా వస్తున్న కొత్త షో ప్రోమోలో సమంతని రివీల్ చేయకపోయినా ఈ షోని హోస్ట్ చేసేది అక్కినేని కోడలే అని చెబుతున్నారు.

ఈమధ్యనే బిగ్ బాస్ హోస్ట్ గా తన సత్తా చాటిన సమంత అహా కోసం స్పెషల్ షో హోస్ట్ గా మారనుంది. ఇందుకు సామ్ భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆహాలో సమంత షో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ కానుంది. మరి ఈ షో ఎలా ఉంటుంది. ఈ షోలో సమంత ఎలా అలరిస్తుంది అన్నది తెలియాలంటే మాత్రం షో వచ్చాక చూడాల్సిందే.