హైదరాబాద్ మెట్రోలో పవర్ స్టార్ సందడి..!

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. వకీల్ సాబ్ షూటింగ్ లో భాగంగా మెట్రో ట్రైన్ లో మాదాపూర్ నుండి మియాపూర్ వరకు జర్నీ చేశారు. అంతేకాదు మెట్రో ట్రైన్ లో తోటి ప్రయాణీకులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. పవన్  తో పాటు వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా ఉన్నారు. 

వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. సినిమాలో నివేదా థామస్, అంజలి కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమా మరో 20 రోజుల షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.