
మాస్ మహరాజ్ రవితేజ, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ బ్లైండ్ రోల్ లో నటించి మెప్పించారు. ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన డైరక్టర్ అనీల్ రావిపుడి రవితేజ కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అయితే ఈ కాంబో మరోసారి రిపీట్ అవబోతున్నట్టు తెలుస్తుంది.
రవితేజ, అనీల్ కాంబోలో మరో సినిమా వస్తుందని టాక్. ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్-3 తీయలానుకున్న అనీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు బిజీగా ఉండటం వల్ల ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక మాస్ రాజా కోసం ఓ కథ రాయడం అది రవితేజకు వినిపించడం ఆయన ఓకే అనడం జరిగిందట. త్వరలోనే ఈ కాంబో సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు చేసేది రాజా ది గ్రేట్ పార్ట్ 2నా లేక కొత్త కథనా అన్నది తెలియాల్సి ఉంది.