బాలయ్య కోసం ఒకరు కాదు ఇద్దరు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. BB3 అంటూ సినిమా నుండి వచ్చిన టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచింది. మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంతవరకు హీరోయిన్ ఎవరన్నది డిసైడ్ చేయలేదు. రాజోలు పిల్ల అంజలి హీరోయిన్ గా సెలెక్ట్ అని అనుకున్నా ఆమె కూడా ఈ సినిమాలో లేదని తెలుస్తుంది. లేటెస్ట్ గా మళయాళ భామ ప్రగ్యా మర్టిన్ ను బాలయ్య సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. అయితే ఈ సినిమాలో మరో మళయాళ భామ కూడా నటిస్తుందని అంటున్నారు.

సినిమాలో ప్రగ్యా మార్టీన్ తో పాటుగా పూర్ణ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ బాలకృష్ణతో రొమాన్స్ చేస్తారని తెలుస్తుంది. సిం హా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది.