మాసే కాదు, క్లాస్ ఆడియన్స్ టార్గెట్ గా సాయి ధరమ్ తేజ్ ప్రయత్నం!

తిక్క అలాంటి డిజాస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ వేసే ప్రతి అడుగు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వేస్తున్నాడు. ఈసారి కేవలం తాను స్ట్రాంగ్ గా ఉన్న సి సెంటర్ లోనే కాకుండా మల్టీప్లెక్స్ లో కూడా మార్కెట్ పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోనే గోపీచంద్ మలినేని సినిమాలో, ఫ్యాషన్ మ్యాగజిన్ ఎడిటర్ అనే సరికొత్త రోల్ లో మనోడు నటిస్తున్నాడు. అయితే రోల్ కి తగ్గట్టుగా తాను కూడా ఫ్యాషన్ గా ఉండాలని, ముంబై హెయిర్ స్టైలిస్ట్ తో ఇదిగో పైన చూపించిన విధంగా ఇలా సరికొత్త హెయిర్ స్టైల్ లో సినిమాలో దర్శనమిస్తాడు. 

ఇక మరో వైపు ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా ఫ్యాషన్ రోల్ లో కనిపిస్తుందని సమాచారం. రకుల్ సినిమాల్లోకి రాకముందే మోడల్ కాబట్టి, ఈ రోల్ లో చించి పారేస్తుందనడంలో సందేహం లేదు. సంక్రాంతి రేస్ లో ఉన్న ఈ సినిమా టైటిల్ నవంబర్ లో రివీల్ చేస్తారని సమాచారం.