పవన్ కళ్యాణ్ వారసుడు వస్తున్నాడు

మన తెలుగు సినీ ఇండస్ట్రీకి వారసులేమీ కొత్త కాదు. మెగా ఫ్యామిలి నుంచి ఇంతవరకు చాలా మంది వారసులు వచ్చారు. ఇప్పుడు మరో వారసుడు వస్తున్నాడు. అతనే పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కుమారుడు అకిరా. అయితే అదేమీ ఇప్పుడు కొత్తగా నిర్మించిన చిత్రం కాదు. అలాగే స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా కాదు. రేణూ దేశాయ్ స్వయంగా దర్శకత్వం వహించిన మరాఠి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ 2014లో విడుదలయింది. దానినే తెలుగులో డబ్బింగ్ చేసి సెప్టెంబర్ 4న ఈటీవి ఛానల్ లో ప్రసారం చేయబోతున్నట్లు రేణుకా దేశాయ్ తెలిపారు. యా సినిమాలో అకిరా చిన్న పాత్ర చేశాడు. బహుశః ఆమె తన ముచ్చట, పవన్ కళ్యాణ్ అభిమానుల ముచ్చటా తీర్చుకోనేందుకే ఈవిదంగా విడుదల చేస్తున్నారేమో? దేనిపై మరి పవన్ కళ్యాణ్ ఏమంటారో? అభిమానుల రియాక్షన్ ఎలాగ ఉంటుందో?