రవితేజది డిఫరెంట్ స్టయిల్

తెలుగు సినీ పరిశ్రమలో రవితేజది పూర్తిగా డిఫరెంట్ స్టయిల్. స్టయిల్ కారణంగానే చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ స్టయిలే ఇప్పుడు ఆయన కొంప ముంచుతోంది కూడా. మాస్ మహారాజ బిరుదు బాగానే ఉంది కానీ అదే ఆయన చుట్టూ ఒక కనబడని గీతగా మారిపోయింది. మొదట్లోఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఖడ్గం, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయివంటి మంచి వెరైటీ సినిమాలు చేసాడు. కానీఇడియట్సినిమా తరువాత మాస్ ఇమేజ్ సంపాదించుకొన్నాడు. మాస్ కిక్ తో వరుసగా చాలా సినిమాలే చేశాడు కానీ వాటిలో ఒకటో రెండో తప్ప ఏవీ పెద్దగా ఆడలేదు. కధాబలం లేని సినిమాలని ఎంచుకోవడం, ఎప్పుడూ ఒకే స్టయిల్లో ఒకే రకమైన పాత్రలు పోషించడమే అందుకు ప్రధాన కారణం. బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పోలిస్తే రవితేజ వయసులో చిన్నవాడే (48) అయినా అతని మొహంలో కళ కూడా బాగా తగ్గినట్లు కనిపిస్తోంది. ఎందుకో అతనికే తెలియాలి. వరుసగా కమర్షియల్ ఫార్ములా సినిమాలలో మాస్ హీరో పాత్రలు చేయడం కంటే, ఇకనైనా కొంచెం డిఫరెంట్ కధలు, పాత్రలు ఎంచుకొంటే మంచిది. బహుశః అందుకేనేమో బెంగాల్ టైగర్ తరువాత వరుసగా కధలు వింటున్నాడు కానీ ఇంతవరకు దేనినీ ఒకే చేయలేదు. చివరికి ఒక కొరియన్ సినిమా నచ్చడంతో దానిని తెలుగులో రీమేక్ చేయాలనుకొంటున్నాడుట! సినిమాని పవర్ దర్శకుడు కే.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహించబోతున్నట్లు తాజా సమాచారం. త్వరలోనే సినిమా గురించి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు. కనీసం సినిమాలో అయినా మాస్ పాత్ర చేయకుండా ఉంటాడో లేదో...చూద్దాం!