
అజార్, ధోని, గంగూలీ, అంటూ సెలెబ్రిటీల జీవిత గాధలని బేస్ చేస్కుని సినిమాలు చేయడం ప్రస్తుతం బాలీవుడ్ లో ట్రెండ్ గా నడుస్తోంది. అయితే ఇప్పుడు అదే ట్రెండ్ ని టాలీవుడ్ కూడా పాటించబోతోంది. ఆ మధ్య అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాధ ని సినిమాగా తెరకెక్కిస్తానంటూ నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడు ముందుకొచ్చాడు.
అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా, తన దర్శకత్వ ప్రతిభ కి మంచి మార్కులే పడ్డాయి అశ్విన్ కి. అదే నమ్మకంతో ఇప్పుడు సావిత్రి బయోపిక్ తీస్తానంటూ సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాకి సరైన నటిని వెతకడానికి గతంలో ఆన్ లైన్ కాంపెయిన్ కూడా నడిపాడు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడంతో, రిస్క్ తీసుకోలేక, అనుభవం ఉన్న హీరోయిన్ ని తీసుకుందామనే ఫిక్స్ అయ్యాడట. నిత్యా మీనన్ ఈ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే గ్లామర్ పాత్రలు చేసే నిత్య, పద్ధతిగా, నిండుగా కనపడే సావిత్రి పాత్రలో ఎలా నటిస్తుందో అనేది పెద్ద ప్రశ్నగా మారింది.